దివ్యాంగులకు నోడల్‌ అథారిటీ: కేంద్రం ఆదేశం

ABN , First Publish Date - 2020-03-28T08:59:29+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో దివ్యాంగులకు సేవలు, సహకారాన్ని అందించేందుకు ప్రత్యేక నోడల్‌ అథారిటీని నియమించాలని

దివ్యాంగులకు నోడల్‌ అథారిటీ: కేంద్రం ఆదేశం

కరోనా వైరస్‌ నేపథ్యంలో దివ్యాంగులకు సేవలు, సహకారాన్ని అందించేందుకు ప్రత్యేక నోడల్‌ అథారిటీని నియమించాలని రాష్ర్టాలకు.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైర్‌సను అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్‌ విధించడం, సామాజిక దూరాన్ని పాటించాల్సి రావడంతో దివ్యాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రం పేర్కొంది. దివ్యాంగులకు అవసరమైన మందులు వారి ఇళ్ల వద్దకే అందించేందుకు రాష్ర్టాలు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Updated Date - 2020-03-28T08:59:29+05:30 IST