గ్రిడ్‌కు ఇబ్బందుల్లేవు
ABN , First Publish Date - 2020-04-05T11:20:55+05:30 IST
ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆదివారం రాత్రి ఒకేసారి లైట్లు ఆపేస్తే విద్యుత్తు డిమాండ్ దాదాపు 12-13 వేల మెగావాట్లు పడిపోతుందని ఇంజనీర్లు అంచనాకు...

- విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేయొద్దు
- ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆదివారం రాత్రి ఒకేసారి లైట్లు ఆపేస్తే విద్యుత్తు డిమాండ్ దాదాపు 12-13 వేల మెగావాట్లు పడిపోతుందని ఇంజనీర్లు అంచనాకు వచ్చారు. ఇక తెలంగాణలో 600 మెగావాట్ల వరకు పడిపోతుందని మన విద్యుత్తు ఇంజనీర్ల అంచనా. 9 నిమిషాల తర్వాత మళ్లీ అందరూ లైట్లు వేస్తే పెరిగే డిమాండ్‌ను తట్టుకోవడానికి జలవిద్యుదుత్పాదనను పెంచనున్నారు.
లైట్లు ఆర్పేయడం వల్ల గ్రిడ్‌కు వచ్చిన ఇబ్బందులేమీ లేవని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. గ్రిడ్ కుప్పకూలుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. లైట్లు ఆర్పితే ఏమీ కాదని, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, ఏసీలు మాత్రం యథాతథంగా ఆన్ చేసే ఉంచాలని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కోరారు. 9 నిమిషాలు లైట్లు ఆర్పేస్తే 600 మెగావాట్లు తగ్గే అవకాశం ఉందని.. 1100 మెగావాట్లు తగ్గినా గ్రిడ్‌కు ఇబ్బందుల్లేవని చెప్పారు. మరోవైపు అంచనాలు తప్పినా, ఏ ఒక్క రాష్ట్రం తప్పిదం చేసినా దేశంలో మొత్తం విద్యుత్తు వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.