సాగు చట్టాలపై కేంద్రానికి లేఖ రాయలేదేం?

ABN , First Publish Date - 2020-12-11T09:02:52+05:30 IST

కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ తొత్తుగా మారారని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ ధ్వజమెత్తారు. కొత్త

సాగు చట్టాలపై కేంద్రానికి లేఖ రాయలేదేం?

 టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ తొత్తుగా మారారని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ ధ్వజమెత్తారు. కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేయడం గర్వకారణమంటూ ప్రధాని మోదీకి లేఖ రాసిన ఆయన.. రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దును కోరుతూ ఎందుకు లేఖ రాయలేదని  గురువారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

రైతుల పట్ల సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శుక్రవారం ప్రధానితో భేటీ సందర్భంగా నల్ల చట్టాల విషయాన్ని ప్రస్తావించాలని, లేని పక్షంలో కేంద్రంతో ఆయన లాలూచీ పడుతున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదని అన్నారు. 


Updated Date - 2020-12-11T09:02:52+05:30 IST