మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

ABN , First Publish Date - 2020-09-24T08:47:37+05:30 IST

అద్దె గదిలో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి ఎప్పుడు చనిపోయాడో ఏమో.. కుక్కలు శరీరాన్ని పీక్కుతినే దాకా ఎవ్వరికీ

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 23: అద్దె గదిలో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి ఎప్పుడు చనిపోయాడో ఏమో.. కుక్కలు శరీరాన్ని పీక్కుతినే దాకా ఎవ్వరికీ తెలియలేదు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికులను ఒళ్లుగగుర్పొడిచేలా చేసింది. మృతుడు నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జమిలం గ్రామానికి చెందిన యాదగిరి (55). కుటుంబ కలహాల కారణంగా నిజామాబాద్‌ ఖానాపూర్‌ పరిధిలోని భాగ్యనగర్‌ కాలనీలో గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఓ కుక్క కుళ్లినపోయిన ఉన్న చేతి భాగాన్ని నోట కరుచుకొని వీధిలోకి వచ్చింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. యాదగిరి నిద్రలోనే నాలుగైదు రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని, ఎవరూ గమనించకపోవడంతో మృతదేహం కుళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. తలుపు సరిగ్గా వేసుకోక పోవడంతో కుక్కలు లోనికి ప్రవేశించి మృతదేహాన్ని పీక్కు తిన్నాయని వెల్లడించారు. 

Updated Date - 2020-09-24T08:47:37+05:30 IST