ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు
ABN , First Publish Date - 2020-04-21T18:35:52+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు

నిజామాబాద్: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వర్షానికి తడిసిన ధాన్యమని.. తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. అయితే కార్పెట్లు సరఫరా చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 కిలోల ధాన్యం బస్తాకు రూ.12.50 రూపాయల హమాలీ చార్జిలను ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే కష్ట కాలంలో హమాలీ చార్జి ప్రభుత్వమే భరించాలని రైతులు వినతి చేస్తున్నారు.