పవన్‌కళ్యాణ్‌పై మంత్రి నిరంజన్‌రెడ్డి సెటైర్లు

ABN , First Publish Date - 2020-11-21T21:58:57+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి నిరంజన్‌రెడ్డి సెటైర్లు వేశారు. జనం లేని సేన జనసేన.. సైన్యం లేని నాయకుడు పవన్‌కళ్యాణ్ అంటూ

పవన్‌కళ్యాణ్‌పై మంత్రి నిరంజన్‌రెడ్డి సెటైర్లు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి నిరంజన్‌రెడ్డి సెటైర్లు వేశారు. జనం లేని సేన జనసేన.. సైన్యం లేని నాయకుడు పవన్‌కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. వరద బాధితులను కేసీఆర్ సర్కారు ఆదుకుంటే.. బీజేపీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికారపార్టీని విమర్శించడమే విపక్షాల అజెండా అని చెప్పారు. సొంత ఎజెండాతో ప్రచారం చేస్తోంది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన నిర్ణయం తీసుకుంది. పవన్‌కల్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపిన అనంతరం పోటీ నుంచి జనసేన తప్పుకుంది. బీజేపీకి మద్దతు తెల్పాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నారు.

Read more