పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు: నిరంజన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-12-30T07:40:41+05:30 IST
రాష్ట్రంలోని పత్తి రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, జనవరి నెలాఖరు వరకు కొనుగోళ్ల ఆంక్షలను ఎత్తివేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సీఎండీ ప్రదీప్ కుమార్ అగర్వాల్‌కు మంగళవారం మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు

రాష్ట్రంలోని పత్తి రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, జనవరి నెలాఖరు వరకు కొనుగోళ్ల ఆంక్షలను ఎత్తివేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సీఎండీ ప్రదీప్ కుమార్ అగర్వాల్‌కు మంగళవారం మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. వరంగల్, మహబూబ్‌నగర్ రీజియన్లలో రోజుకు 15 వేల బేళ్లు, ఆదిలాబాద్ రీజియన్‌లో 10 వేల బేళ్లు మాత్రమే కొనాలని అధికారులకు సీసీఐ ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాదీ పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారని, ఈ సమయంలో ఆంక్షలు విధించడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతారని, మద్దతు ధర దక్కదన్న భయానికి లోనయ్యే ప్రమాదముందన్నారు.