సోషల్ మీడియాలో మెసేజ్ : నిలోఫర్ వద్ద బారులుదీరారు!
ABN , First Publish Date - 2020-03-24T16:27:42+05:30 IST
జనతా కర్ఫ్యూ.. ఆ వెంటనే లాక్‌డౌన్ కారణంగా ఆస్పత్రులో..

- ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల పంపిణీ
- గుమిగూడిన రోగుల సహాయకులు
- వెనక్కి పంపించిన పోలీసులు, ఆస్పత్రి వర్గాలు
హైదరాబాద్/మంగళ్‌హాట్ : జనతా కర్ఫ్యూ.. ఆ వెంటనే లాక్‌డౌన్ కారణంగా ఆస్పత్రులో ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్న రోగుల సహాయకులు ఆకలితో అలమటిస్తున్నారని సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో నిలోఫర్ ఆస్పత్రి వద్దకు సోమవారం పలువురు దాతలు భోజనాలు తీసుకొని వచ్చారు. దీంతో వారిని అక్క డి నుంచి పంపించేందుకు పోలీసులు ఆస్పత్రివర్గాలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే పలువురు దాతలు ఆహారపదార్థాలు, ఇతర వస్తువులు తీసుకుని ఆస్పత్రి వద్ద వచ్చారు. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద పులిహోరా, ఉప్మా, భోజనం, ఇతర టిఫిన్లు, మంచినీరు ఇలా ఎవరికి తోచింది వారు అందించడం తో రోగుల సహాయకులు, స్థానికంగా ఉండే అనాథలు వాటిని తీసుకునేందుకు గుమిగూడారు.
దీంతో ఆ ప్రాంతంలో తోపులాట చోటు చేసుకుంది. అనుమతి లేనిదే ఆ హారపదార్థాలు కానీ, ఇతర వస్తువులు కానీ ఇవ్వవద్దని ఆస్పత్రి సిబ్బంది వారించినా వినకుండా దాతలు అక్కడివారికి అందించారు. దీంతో నాంపల్లి పోలీస్‌స్టేషన్ నుంచి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి గేటు వరకు రద్దీ నెలకొంది. మరికొందరు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణతో పాటు, నాంపల్లి ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషాకు ఫో న్ చేసి ఆహార పదార్థాలు తీసుకొస్తామన్నారు. అయితే, తామే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అన్న దానం చేసేందుకు ఎవరూ రావద్దని వివరించారు.
గుంపులుగా రోగి సహాయకులు..
నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండెంట్ల కోసం ఏ ర్పాటు చేసిన షెడ్డుల్లో రోగి సహాయకులు పెద్ద ఎత్తున గుంపులుగా కూర్చొని ఉన్నా పాలకవర్గం పట్టించుకోలేదు. రోగి సహాయకులకు కనీసం మాస్కులు, శానిటైజర్లను సైతం అందించలేదు. అలాగే, ఆస్పత్రిలోని రోగులకు వివిధ పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేయించుకురావాలని చెప్పారు. రవాణా సౌకర్యం లే ని సమయంలో ఎలా వెళ్లాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలను వేడుకోవడం కనిపించింది.
