రైతు సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి- మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-02-08T22:20:25+05:30 IST

రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక నిర్ణయాలు తీసుకున్నారని, రైతుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

రైతు సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి- మంత్రి నిరంజన్‌రెడ్డి

 రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక నిర్ణయాలు తీసుకున్నారని, రైతుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్కెటింగ్‌శాఖలో పదోన్నతులుకల్పించినందుకు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డితో కలిసి పలువురు ఉద్యోగులు మంత్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు రైతులకు చేరువై మార్కెటింగ్‌శాఖకు మంచిపేరు తీసుకు రావాలని అన్నారు. వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకోవడం లేదన్నారు. రైతులకు రైతుభీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్‌ సరఫరా దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కేంద్రానికి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలు దిక్సూచిగా నిలుస్తున్నాయనిఅన్నారు. రైతులకు  గిట్బబటాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలుచేసేందుకు ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖలో ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నుంచి ఉన్న శ్రేణి కార్యదర్శులుగా పదోన్నతలుకు ఎనిమిది మందిని అర్హులుగా గుర్తించి నలుగురికి ఉత్తర్వులు ఇచ్చామన్నారు. 

Updated Date - 2020-02-08T22:20:25+05:30 IST