దేశవ్యాప్తంగా సంజీవయ్య శత జయంత్యోత్సవాలు

ABN , First Publish Date - 2020-07-08T08:16:23+05:30 IST

దేశవ్యాప్తంగా సంజీవయ్య శత జయంత్యోత్సవాలు

దేశవ్యాప్తంగా సంజీవయ్య శత జయంత్యోత్సవాలు

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు సంజీవయ్య ఫౌండేషన్‌  కృషి చేస్తుందని ఆ సంస్థ ఛైర్మన్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి దాసరి శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్‌ ప్రశాసన్‌ న గర్‌లో మంగళవారం ఫౌండేషన్‌  సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రిగా సంజీవయ్య అందించిన సేవలను ఈ సందర్భంగా ఫౌండేషన్‌  కొనియాడింది. ఆయన శత జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 14, 2021 నుంచి ఫిబ్రవరి 14, 2022 వరకు ఉత్సవాలు నిర్వహించాలని తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలను కోరినట్లు శ్రీనివాసులు తెలిపారు. 

Updated Date - 2020-07-08T08:16:23+05:30 IST