కొత్తగా లక్ష మహిళా సంఘాలు

ABN , First Publish Date - 2020-12-11T08:24:58+05:30 IST

రాష్ట్రంలోని ప్రతి పేద మహిళను స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) పరిధిలోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. గ్రామీణ

కొత్తగా లక్ష మహిళా సంఘాలు

జనవరి నెలాఖరులోగా ఏర్పాటు చేయాలి...సెర్ప్‌ సిబ్బందికి అధికారుల సూచన

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి పేద మహిళను స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ) పరిధిలోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకల్లా కనీసం లక్ష సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పేద మహిళలందరినీ గుర్తించి, వారిని సంఘాల పరిధిలోకి తేవడం ద్వారా ప్రభుత్వాలు అందించే పథకాలు, ఆర్థిక చేయూత ద్వారా వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని భావిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వాలు అనేక పథకాలు మంజూరు చేస్తున్నాయి.


వాణిజ్య బ్యాంకుల ద్వారా, స్ర్తీ నిఽధి బ్యాంకు ద్వారా ఏటా సుమారు రూ.4వేల కోట్ల వరకు రుణాలుగా అందిస్తున్నాయి. తద్వారా సంఘాలు సొంతంగా కొన్ని వృత్తులు చేసుకోవడం, ఉత్పత్తులు తయారు చేసి విక్రయించడం, పాడి పరిశ్రమ వంటివి చేపట్టాయి.

తాజాగా ధాన్యం కొనుగోలును ముమ్మరం చేశాయి. లాక్‌డౌన్‌ సమయంలో వ్యవసాయ మార్కెట్లన్నీ మూత పడి ఉండగా... ప్రతి గ్రామంలోనూ మహిళా సంఘాలే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. 


Updated Date - 2020-12-11T08:24:58+05:30 IST