కొత్తగా 536 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-17T08:02:10+05:30 IST
రాష్ట్రంలో మంగళవారం 536 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ముగ్గురు మృతి చెందారు. 622 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో మంగళవారం 536 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ముగ్గురు మృతి చెందారు. 622 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసులు 2,79,135కు, మరణాలు 1502కు, రికవరీలు 2,70,450కు చేరాయి. కాగా, కొద్ది రోజులుగా జిల్లాల్లో పాజిటివ్‌ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా 17 జిల్లాల్లో పదిలోపే కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 107, మేడ్చల్‌లో 43, రంగారెడ్డి జిల్లాలో 41, వరంగల్ అర్బన్‌లో 27 నమోదయ్యాయి. ప్రస్తుతం 7,183 యాక్టివ్ కేసులు ఉన్నాయి.