నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు: జనగామ డీసీపీ
ABN , First Publish Date - 2020-12-31T04:07:00+05:30 IST
నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు: జనగామ డీసీపీ

జనగామ కల్చరల్, డిసెంబరు 30: కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఇండ్లలోనే జరుపుకోవాలని, బహిరంగ వేడుకలకు అనుమతి లేదని డీసీపీ బి.శ్రీనివాసరెడ్డి సూచించారు. హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, కాలనీలు, ప్రధాన రోడ్ల కూడలిలో సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులు లేవన్నారు. ఈ నెల 31 సాయంత్రం 7 గంటల నుండి జిల్లా పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని సూచించారు.