కిడ్నీ రాకెట్‌లో కొత్త కోణం.. హైదరాబాద్, బెంగుళూరు వేదికగా దందా..

ABN , First Publish Date - 2020-07-22T15:23:35+05:30 IST

హైదరాబాద్: కిడ్నీ రాకెట్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో ఆసక్తికర విషాయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కిడ్నీ రాకెట్‌లో కొత్త కోణం.. హైదరాబాద్, బెంగుళూరు వేదికగా దందా..

హైదరాబాద్: కిడ్నీ రాకెట్‌లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో ఆసక్తికర విషాయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగం కోసం 2014లో దినేష్ అనే  యువకుడు కొలంబోకి వెళ్ళాడు. కొలంబోలో కిడ్నీ రాకెట్ చేతికి చిక్కాడు. నాలుగు లక్షలకు కిడ్నీ అమ్ముకున్న దినేష్.. వెద్యం వికటించి ప్రాణాలు కోల్పోయాడు. కిడ్నీ రాకెట్ వెనుక బెంగళూరుకు చెందిన డాక్టర్ మానిక్ హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రస్తుతం డాక్టర్ మానిక్ పరారీలో ఉన్నారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఇప్పటికే వెంకటేష్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ ముఠా చేతిలో 100 మంది అమాయక జనాలు బలైనట్లు సమాచారం. ప్రధాన సూత్రధారిని పట్టుకుంటేనే ఈ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు చేయొచ్చని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీలలో ఈ దందా  ప్రధానంగా నడుస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-07-22T15:23:35+05:30 IST