సోమశిలలో కొత్త రాతియుగపు ఆనవాళ్లు

ABN , First Publish Date - 2020-12-28T08:54:45+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామంలో క్రీపూ. 4000-2000 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన కొత్త రాతియుగపు ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ శివనాగిరెడ్డి.. ఆదివారం సోమశిలలో జరిపిన అన్వేషణలో కొత్తరాతి యుగపు కాలం నాటి ఓ రాతిగొడ్డలి

సోమశిలలో కొత్త రాతియుగపు ఆనవాళ్లు

బయల్పడిన క్రీపూ. 4000-2000 కాలం నాటి రాతిగొడ్డలి


నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి)/కొల్లాపూర్‌ రూరల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామంలో క్రీపూ. 4000-2000 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన కొత్త రాతియుగపు ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ శివనాగిరెడ్డి.. ఆదివారం సోమశిలలో జరిపిన అన్వేషణలో కొత్తరాతి యుగపు కాలం నాటి ఓ రాతిగొడ్డలి బయటపడింది. దేవాలయం సమీపంలో ఉన్న ఓ పొలంలో.. నాలుగు అంగుళాల పొడువు, రెండు అంగళాల వెడల్పు, అర అంగళం మందం ఉన్న నల్ల శానపు రాతితో చేసిన గొడ్డలిని ఆయన గుర్తించారు. నాటి ప్రజలు.. పశువులను మచ్చిక చేసుకుని ఈ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవించారని శివనాగిరెడ్డి చెప్పారు. వారు పని ముట్ల తయారీలో నైపుణ్యం సాధించారని దీని ద్వారా తెలుస్తోందన్నారు.  

Updated Date - 2020-12-28T08:54:45+05:30 IST