‘ధ్రువ్స్‌’.. కరెన్సీ శానిటైజింగ్‌ మెషీన్‌

ABN , First Publish Date - 2020-05-11T09:28:31+05:30 IST

కరోనా వ్యాప్తితో జనం కరెన్సీ నోట్లను, ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్లను ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి ...

‘ధ్రువ్స్‌’.. కరెన్సీ శానిటైజింగ్‌ మెషీన్‌

  • డీఆర్‌డీవో సరికొత్త ఆవిష్కరణ
  • మొబైల్స్‌, ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌ శుద్ధి

అల్వాల్‌, మే 10(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తితో జనం కరెన్సీ నోట్లను, ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్లను ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి పరిష్కారంగా హైదరాబాద్‌ డీఆర్‌డీవో ప్రీమియర్‌ లాబ్‌ ఆర్‌సీఐ (రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌) ఓ శానిటైజింగ్‌ యంత్రాన్ని తయారు చేసింది. కాంటాక్ట్‌ అవసరం లేకుండా ఆటోమాటిక్‌ సెన్సార్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ యంత్రం పేరు ‘ధ్రువ్స్‌’ (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అలా్ట్రవైలెట్‌ శానిటైజర్‌). దీనికి సెన్సార్‌ స్విచ్‌లు అమర్చడం వల్ల దీని దగ్గరకు వెళ్లగానే ఆటోమేటిక్‌గా కాబినేట్‌ తెరుచుకుంటుంది. శానిటైజ్‌ చేయాల్సిన వస్తువును అందులో ఉంచిన వెంటనే దీని ఆపరేషన్‌ మొదలవుతుంది. దీనితో మొబైల్స్‌, ఐపాడ్స్‌, లాప్‌టాప్స్‌ తదితరాలను శానిటైజ్‌ చేసుకోవచ్చు. అలాగే కరెన్సీ నోట్లను శానిటైజ్‌ చేసేందుకు కూడా మరో యూవీసీ (అలా్ట్రవైలెట్‌ క్లీనింగ్‌) యంత్రాన్ని ఆర్‌సీఐ అభివృద్ధి చేసింది. దీని పేరు ‘నోట్స్‌ క్లీన్‌’.  

Updated Date - 2020-05-11T09:28:31+05:30 IST