మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-12-01T16:57:47+05:30 IST

గ్రేటర్‎లోని మియాపూర్ సమీపంలో న్యూ హఫీజ్‎పేట్ వద్ద ఆదిత్యనగర్‎లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ ....

మియాపూర్ న్యూ హఫీజ్ పేట్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: గ్రేటర్‎లోని మియాపూర్ సమీపంలో న్యూ హఫీజ్‎పేట్ వద్ద ఆదిత్యనగర్‎లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లరకు డబ్బులు పంచుతుండగా మాదాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ రెడ్ హ్యండెడ్‎గా పట్టుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ నాయకులకే మద్దతు తెలుపుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

Updated Date - 2020-12-01T16:57:47+05:30 IST