కొత్త విద్యుత్తు సంస్కరణలతో ఉద్యమాలు

ABN , First Publish Date - 2020-06-04T10:02:14+05:30 IST

నూతన విద్యుత్తు సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించిన పక్షంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ ఉద్యమా లు

కొత్త  విద్యుత్తు సంస్కరణలతో ఉద్యమాలు

  • సీపీఐ నాయకులు కె.నారాయణ,  చాడ వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యుత్తు సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించిన పక్షంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ ఉద్యమా లు తలెత్తుతాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హెచ్చరించారు. విద్యుత్‌ సంస్కరణలను వ్యతిరేకిస్తూ గ్రామ స్థాయి నుంచి ప్రజా ఉద్యమం మొదలైతే మోదీ ప్రభుత్వం తట్టుకోవడం కష్టమన్నారు. కేంద్రం విద్యుత్‌ సవరణ బిల్లును  తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదాయపన్ను శాఖ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ సవరణ చట్టానికి వ్యతిరేకం గా సీఎంకేసీఆర్‌ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమించాలన్నారు.   

Updated Date - 2020-06-04T10:02:14+05:30 IST