కొత్త విద్యుత్ చట్టాన్ని పార్లమెంట్‌లో అడ్డుకుంటాం: ఎంపీ వెంకటేష్

ABN , First Publish Date - 2020-09-13T21:18:21+05:30 IST

కొత్త విద్యుత్ చట్టాన్ని పార్లమెంట్‌లో అడ్డుకుని తీరుతామని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల కోసం పార్లమెంటులో

కొత్త విద్యుత్ చట్టాన్ని పార్లమెంట్‌లో అడ్డుకుంటాం: ఎంపీ వెంకటేష్

పెద్దపల్లి: కొత్త విద్యుత్ చట్టాన్ని పార్లమెంట్‌లో అడ్డుకుని తీరుతామని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల కోసం పార్లమెంటులో పోరాటం చేస్తామని ప్రకటించారు. బీజేపీ ఎంపీలకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తమతో కలసి పోరాడాలని కోరారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలిస్తారో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో 11శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందని తెలిపారు. కాలుష్యానికి గురయ్యే లక్ష్మీపురం, వీర్లుపల్లి గ్రామాలను కేంద్రమే ఆదుకోవాలని, బీజేపీలు ఎంపీలు, కేంద్రమంత్రులు అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెంకటేష్ తప్పుబట్టారు.


Updated Date - 2020-09-13T21:18:21+05:30 IST