ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త బిల్డింగ్‌ నిర్మించాలి

ABN , First Publish Date - 2020-07-18T08:03:53+05:30 IST

ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త బిల్డింగ్‌ నిర్మించాలని, దీనికి ఎవరైనా అడ్డుపడితే వారిని ఎదుర్కొని ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలంగాణ మెడికల్‌ జేఏసీ, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు తెలిపారు.

ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త బిల్డింగ్‌ నిర్మించాలి

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రిలో  కొత్త బిల్డింగ్‌ నిర్మించాలని, దీనికి ఎవరైనా అడ్డుపడితే వారిని ఎదుర్కొని ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలంగాణ మెడికల్‌ జేఏసీ, ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు తెలిపారు. పదేళ్లుగా ఎదురుచూస్తున్న యూజీసీ పే స్కేల్‌ ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం సంతకం చేసిన నేపథ్యంలో ఆయనకు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వైద్యుల సంఘం అధ్యక్షుడు పల్లం ప్రవీణ్‌, మెడికల్‌ జేఏసీ ప్రతినిధులు నరహరి, జూపల్లి రాజేందర్‌, బొంగు రమేశ్‌, పుట్ల శ్రీనివాస్‌  కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌, ఈటల ఫొటోలకు వైద్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం కేసీఆర్‌ తీసుకున్నారన్నారు.

Updated Date - 2020-07-18T08:03:53+05:30 IST