హైదరాబాద్‌లో ‘నెట్‌జీరో ఎనర్జీ భవనం’
ABN , First Publish Date - 2020-12-06T08:04:24+05:30 IST
సంప్రదాయ విద్యుత్తును ఏ మాత్రం వాడకుండా.. కేవలం సంప్రదాయేతర(సోలార్, పవన)

ఎస్పీడీసీఎల్ స్థలంలో నిర్మించనున్న రెడ్‌కో
హైదరాబాద్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): సంప్రదాయ విద్యుత్తును ఏ మాత్రం వాడకుండా.. కేవలం సంప్రదాయేతర(సోలార్, పవన) విద్యుత్తును వినియోగించేలా ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో తొలిసారిగా ఒక ’నెట్‌జీరో ఎనర్జీ బిల్డింగ్’ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డిజైన్ రూపొందించడానికి ఆర్కిటెక్ట్‌ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ నోటీసును ఈ మేరకు జారీ చేసింది.
ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా plg@tsredco.telangana.gov.in అనే ఈ మెయిల్‌కు పూర్తి వివరాలతో దరఖాస్తు పంపాలని రెడ్‌కో కోరింది. నగరం నడిమధ్యలో ఎస్పీడీసీఎల్‌కు చెందిన 1872గజాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. నిర్మాణానికి సాంకేతిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సరెడ్‌కో)కు యూఎస్ ఎయిడ్ అనే సంస్థ అందించనుంది.