అల్పాహార ప్యాకెట్లు పంపిణీ చేసిన నేతాజీ యువజన సంఘం

ABN , First Publish Date - 2020-04-07T21:06:13+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న యాచకులకు నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అల్పాహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ,పండ్లు పంపిణీ చేశారు.

అల్పాహార ప్యాకెట్లు పంపిణీ చేసిన నేతాజీ యువజన సంఘం

పాల్వంచ :  లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న యాచకులకు నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అల్పాహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ,పండ్లు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేతాజీ సంఘం 8 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు కార్యక్రమానికి కేటీపీఎస్ ఐదో గ్రేడ్ ఎస్‌ఈ కాటం సంజీవయ్య, వనమా కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కే తేజ హాజరై యాచకులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌జేకే అహ్మద్, సంఘ సభ్యులు సయ్యద్ అక్బర్, ఎండీ అబ్దుల్ రజాక్ (మున్నా), ఏవీ రాఘవులు, జిలేపల్లి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

Read more