విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి రైతు బలి

ABN , First Publish Date - 2020-06-16T09:46:22+05:30 IST

విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో రైతు నిండు ప్రాణాన్ని బలిగొని, కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభం విరిగినా..

విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి రైతు బలి

  • నెలక్రితం విరిగిన విద్యుత్తు స్తంభం 
  • ఫిర్యాదు చేసినా తొలగించని తీగలు
  • ఆ వైర్లకు తగిలి షాక్‌తో అక్కడికక్కడే మృతి

రెంజల్‌, జూన్‌ 15: విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో రైతు నిండు ప్రాణాన్ని బలిగొని,  కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభం విరిగినా.. దాన్నుంచి విద్యుత్తు తీగలను తొలగించకపోవడంతో అవి తాకి రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండల కేంద్ర శివారులో జరిగింది. మృతుడు 55 ఏళ్ల ప్రకాశ్‌. నెల క్రితం విద్యుత్తు స్తంభం విరిగినా అధికారులు పట్టించుకోలేదు. సోమవారం పంట పొలాల్లోకి వెళ్లిన ప్రకాశ్‌ ప్రమాదవశాత్తు ఆ తీగలకు తగలడంతో  అక్కడికక్కడనే మృతి చెందాడు.


గతంలో ఈ విషయమై విద్యుత్తు శాఖ అధికారులను ప్రకాశ్‌ కలిసి ఫిర్యాదు చేశాడని, వారు పట్టించుకోలేదని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తన భర్త మృతిచెందాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Updated Date - 2020-06-16T09:46:22+05:30 IST