ఆ ఏడుగురికి నెగెటివ్‌.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు

ABN , First Publish Date - 2020-04-07T20:05:27+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లా గడ్డిగూడెంవాసికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు అతడితో సన్నిహితంగా ఉన్న 17 మంది రక్తనమూనాలను

ఆ ఏడుగురికి నెగెటివ్‌.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు

మిగతా 10 మంది రిపోర్ట్‌ కోసం నిరీక్షణ

మహబూబాబాద్‌ (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ జిల్లా గడ్డిగూడెంవాసికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు అతడితో సన్నిహితంగా ఉన్న 17 మంది రక్తనమూనాలను రెండురోజుల క్రితం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపించారు. కాగా అందులో ఏడుగురి రక్త నమూనాల రిపోర్టు సోమవారం వైద్యాధికారులకు అందింది. ఏడుగురికి నెగిటివ్‌ అని తేలింది.  ఇందులో గడ్డిగూడెం వాసి భార్య, కుమారుడు, అత్తతో పాటు  ఇంటి సమీపాన ఉండే ఆర్‌ఎంపీ వైద్యుడు, ఆ ఇంటికి కుట్టుమిషన్‌ నేర్చుకోవడానికి వెళ్లిన యువతితో పాటు స్థానిక సర్పంచ్‌, మహబూబాబాద్‌లో ఉండే ఇంకో వ్యక్తికి నెగిటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చిందని తెలియడంతో సంబంధిత కుంటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. మిగతా 10 మంది రిపోర్ట్‌ కోసం ఆయా గ్రామస్థులు వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా గడ్డిగూడెం గ్రామాన్ని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సందర్శించి గ్రామస్థులకు మనోస్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేశారు.

Read more