పోలీసుల అదుపులో ఎన్డీ దళ కమాండర్?
ABN , First Publish Date - 2020-03-25T10:34:57+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డకు చెందిన ఎన్డీ దళ కమాండర్ ఆరెం నరేశ్‌ను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి

ఇద్దరు సీపీ బాట సభ్యుల అరెస్టు
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్/గుండాల, మార్చి 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డకు చెందిన ఎన్డీ దళ కమాండర్ ఆరెం నరేశ్‌ను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన అనారోగ్యంతో ఇంటి వద్ద ఉండగా పట్టుకెళ్లారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా, ఎన్డీ సీపీ బాటకు చెందిన ఇద్దరు దళ సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం చుంచుపల్లి పోలీసులు క్రాంతి నగర్ గొత్తికోయ గుంపు శివారు అటవీ ప్రాంతంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని గార్ల మండలం పోచారం గ్రామానికి చెందిన పప్పుల సురేందర్ జీవన్, వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం సూదాన్‌పల్లికి చెందిన కనకం మల్లేశ్ కొండన్నగా గుర్తించారు.
మావోయిస్టు కొరియర్ అరెస్టు
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా మండలం చౌటుపర్తికి చెందిన వేల్పుల రమేశ్ అలియాస్ వివేక్ కొంతకాలంగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌కు కొరియర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో పోలీసులు మంగళవారం రమేశ్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రివాల్వర్, విప్లప సాహిత్య కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.