10 లక్షల మందికి పట్టా బుక్కులు అందలే
ABN , First Publish Date - 2020-07-27T08:39:29+05:30 IST
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని, భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా సుమారు 10 నుండి 12 లక్షల మంది

- కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని, భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా సుమారు 10 నుండి 12 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించలేదని కాంగ్రెస్ కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. పాస్‌పుస్తకాలు రాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పట్టా పుస్తకాల కోసం రైతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. గజ్వేల్ జిల్లా రైతులకు ఇంటి వద్దకే పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపుతామని మొన్న సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఆయన గజ్వేల్‌కు ముఖ్యమంత్రా..? లేక తెలంగాణ రాష్ట్రానికా..? అని ప్రశ్నించారు. రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా అవినీతి మయమైందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నాయకులు ఇదే అదనుగా భూ కబ్జాలు చేస్తున్నారని, ఈ ఆక్రమణలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కోదండరెడ్డి అన్నారు.