వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా రాష్ర్టీయ ఏక్తాదివస్‌ ప్రతిజ్ఞ

ABN , First Publish Date - 2020-10-31T21:08:29+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ రాష్ర్టీయ ఏక్తా దివస్‌’లో భాగంగా శనివారం సెక్రటేరియట్‌లో ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు

వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా రాష్ర్టీయ ఏక్తాదివస్‌ ప్రతిజ్ఞ

హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ రాష్ర్టీయ ఏక్తా దివస్‌’లో భాగంగా శనివారం సెక్రటేరియట్‌లో ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఆర్‌అండ్‌బి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌శర్మ జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవిగుప్త, డైరెక్టర్‌ ప్రోటోకాల్‌ అరవిందర్‌ సింగ్‌ నేతృత్వంలో సిబ్బంది చేత ఏక్తాదివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను పరిరక్షించడానికి నాకు నేనుగా అంకితమవుతూ నా తోటి దేశ వాసుల్లో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కూడా శాయశక్తులా కృషి చేస్తానని, సత్యనిష్టతో నే ను ప్రమాణం చేస్తున్నాను.


ఈ ఐక్యత సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌ దార్శనీయత, చర్యల ద్వారా సాకారం అయింది. నా దేశ అంతర్గత భద్రతను కాపాడడానికి నా స్వంత తోడ్పాటును అందించాలని కూడా నేను సత్యనిష్టతో తీర్మానిస్తున్నానను అని ప్రతిజ్ఞ చేయించారు. 

Read more