రాజ్ భవన్ లో జాతీయ ఐక్యతా దినోత్సవం
ABN , First Publish Date - 2020-10-31T22:30:38+05:30 IST
భారత తొలి ఉప ప్రధాన మంత్రి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాజ్ భవన్ లో శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాని నిర్వహించారు.

హైదరాబాద్: భారత తొలి ఉప ప్రధాన మంత్రి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాజ్ భవన్ లో శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాని నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ దర్బార్ హాల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ చిత్ర పటాన్ని పుష్పమాలతో అలంకరించి నివాళులు అర్పించారు. తర్వాత రాజ్ భవన్ ఆఫీసర్లు, సిబ్బందితో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు, రక్షణకు పాటుపడతామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలను విలీనం చేసి భారత్ ఐక్యతకు చేసిన కృషి గవర్నర్ ఈ సందర్భంగా గుర్తుచేసి, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.