రైతులకు అన్యాయం జరగనివ్వం

ABN , First Publish Date - 2020-10-10T09:13:34+05:30 IST

ఫార్మాసిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను వ్యతిరేకించి తీరుతామని జాతీయ బీసీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ లోకేశ్‌కుమార్..

రైతులకు అన్యాయం జరగనివ్వం

ఫార్మాసిటీ కోసం బలవంతపు భూసేకరణ

ఆర్డీవోను నిలదీసినజాతీయ బీసీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ లోకేశ్‌కుమార్‌


యాచారం/కందుకూరు, అక్టోబరు 9 : ఫార్మాసిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను వ్యతిరేకించి తీరుతామని జాతీయ బీసీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రజాపతి తేల్చిచెప్పారు. 80 శాతం మంది రైతుల అంగీకారం ఉంటేనే భూసేకరణ చేయాలనే నిబంధనను రాష్ట్ర సర్కారు పాటించడం లేదని స్పష్టమవుతోందన్నారు. ఫార్మాసిటీ కోసం భూసేకరణలో రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామ రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.


ఫార్మాసిటీ పరిధిని మొదట 3వేల ఎకరాలు, ఆ తరువాత 5వేల ఎకరాలు, ప్రస్తుతం ఏకంగా 19,333 ఎకరాలకు ఎందుకు పెంచారు? దీన్ని మరింత పెంచనున్నారా? అని ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచలంను లోకేశ్‌కుమార్‌ ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీని ఢిల్లీకి పిలిచి మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంగలిగడ్డతండాకు చెందిన భీమ్లానాయక్‌ పత్తి, టమాట, మొక్కజొన్న మొక్కలను తెచ్చి కమిషన్‌ సభ్యులకు చూపిస్తూ రోదించారు. 

Updated Date - 2020-10-10T09:13:34+05:30 IST