రైతు నర్సింహులుది ప్రభుత్వ హత్యే: మోత్కుపల్లి
ABN , First Publish Date - 2020-07-31T00:34:14+05:30 IST
రైతు నర్సింహులుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యేనని బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
సిద్దిపేట: రైతు నర్సింహులుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యేనని బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని ప్రకటించారు. దళితులను అణచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే.. ఇలా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలన నియంతృత్వానికి పరాకాష్టగా మారిందని మోత్కుపల్లి నరసింహులు మండిపడ్డారు.