పొగాకు జయరామ్‌ను అభినందించిన లోకేశ్
ABN , First Publish Date - 2020-10-03T21:02:04+05:30 IST
తెలంగాణ తెలుగు యువత ప్రెసిడెంట్ పొగాకు జయరామ్‌ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసించారు.

అమరావతి: తెలంగాణ తెలుగు యువత ప్రెసిడెంట్ పొగాకు జయరామ్‌ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసించారు. కోవిడ్ ప్రబలుతున్న ఈ సమయంలో కూడా, అన్ని జాగ్రత్తలు తీసుకుని ధైర్యంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 256 మందితో రక్తదానం చేయించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలవాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.