అంబులెన్సుల కొనుగోలుకు నామా సాయం

ABN , First Publish Date - 2020-09-06T09:16:37+05:30 IST

అంబులెన్సుల కొనుగోలుకు నామా సాయం

అంబులెన్సుల కొనుగోలుకు నామా సాయం

మంత్రి కేటీఆర్‌కు రూ.1.23కోట్ల చెక్కు అందజేత

ఖమ్మం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగాను ఆరు కొత్త అంబులెన్సుల కోసం రూ.1.23కోట్ల చెక్కును ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌కు అందించారు. కొవిడ్‌ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే కరోనా బాధితుల కోసం ఆరు అంబులెన్సుల కొనుగోలుకు ఈ నిధులు అందిస్తున్నట్టు నామా తెలిపారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అంబులెన్సుల ద్వారా వైద్యసేవలు అందుతాయని వివరించారు. 

Updated Date - 2020-09-06T09:16:37+05:30 IST