ఉమ్మడి నల్లగొండలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-03-24T15:54:21+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. బైక్‌లపై ఒకరి కంటే ఎక్కువ వెళ్తే కేసులు పెడుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న పలువురి వాహనాలను సీజ్ చేశారు.

ఉమ్మడి నల్లగొండలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. బైక్‌లపై ఒకరి కంటే ఎక్కువ వెళ్తే కేసులు పెడుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న పలువురి వాహనాలను సీజ్ చేశారు. ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని నల్లగొండ ఎస్పీ రంగనాథ్ హెచ్చరించారు. మరోవైపు జిల్లా పరిధిలోని రాష్ట్ర సరిహద్దులైన నాగార్జున సాగర్, వాడపల్లి వద్ద ఏపీ నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలాఉండగా, కరోనా వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఇద్దరు నకిలీ విలేకరులపై కోదాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు మఠంపల్లి మండలానికి చెందిన కంపాటి సందీప్‌, నాగు గా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కోదాడ రామాపురం క్రాస్ రోడ్‌లో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలను పూర్తిగా నిలిపివేశారు.

Read more