జుడీషియల్‌ రిమాండ్‌కు నలమాస కృష్ణ

ABN , First Publish Date - 2020-06-19T10:06:43+05:30 IST

తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌కు పంపింది. మావోయిస్టులతో

జుడీషియల్‌ రిమాండ్‌కు నలమాస కృష్ణ

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌కు పంపింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై కృష్ణను ఎన్‌ఐఏ  నాలుగు రోజుల క్రితం ఖమ్మంలో అరెస్ట్‌ చేసింది. ఖమ్మం కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి  ఎదుట గురువారం ప్రవేశ పెట్టారు. విచారణ అనంతరం కృష్ణను జడ్జి 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌కు పంపడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా ఒక్క కేసులో తీసుకెళ్లిన పోలీసులు తన భర్తపై ఏడు కేసులు పెట్టారని కృష్ణ భార్య సంధ్య ఆరోపించారు. 8 నెలలు జైల్లో ఉండి జూన్‌ 6న బెయిల్‌పై విడుదలయ్యారని చెప్పారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన భర్తను గత ఆదివారం ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారన్నారు. 

Updated Date - 2020-06-19T10:06:43+05:30 IST