నలమాస కృష్ణను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన ఎన్‌ఐఏ

ABN , First Publish Date - 2020-06-19T01:21:19+05:30 IST

టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను నాంపల్లి కోర్టులో ఎన్‌ఐఏ అధికారులు హాజరుపరిచారు. కృష్ణను రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

నలమాస కృష్ణను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన ఎన్‌ఐఏ

హైదరాబాద్: టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను నాంపల్లి కోర్టులో ఎన్‌ఐఏ అధికారులు హాజరుపరిచారు. కృష్ణను రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఎన్‌ఐఏ అధికారులు కృష్ణను ఆదివారం ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కృష్ణ 8 నెలల పాటు జైలు జీవితం గడిపి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఆయన ఖమ్మంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు ఎన్‌ఐఏ బృందం కృష్ణ కుటుంబ సభ్యులకు వారెంట్‌ కాపీని ఇచ్చారు. 

Updated Date - 2020-06-19T01:21:19+05:30 IST