సీపీఎస్ రద్దు చేస్తే తప్పుకొంటా: నాగేశ్వర్
ABN , First Publish Date - 2020-12-15T08:39:08+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎ్‌స)ను రద్దు చేస్తే.. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎ్‌స)ను రద్దు చేస్తే.. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధమని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా నాలుగో మహాసభ సోమవారం దోమలగూడ టీఎ్‌సయూటీఎఫ్ భవన్‌లో జరిగింది.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే అన్ని ఉద్యమాల్లో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న జిల్లాలో జరిగే ఒక రోజు నిరాహార దీక్షను, 29న జరిగే రాష్ట్ర స్థాయి మహాధర్నాను విజయవంతం చేయాలని టీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య కోరారు.