నాగర్‌కర్నూల్: కృష్ణానదిలో వ్యక్తి గల్లంతు
ABN , First Publish Date - 2020-09-01T13:43:48+05:30 IST
జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట కృష్ణానదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

నాగర్‌కర్నూల్: జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట కృష్ణానదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈత కోసం వెళ్లిన కిరణ కుమార్(24) ఊపిరాడక నీటిలో మునిగిపోయాడు. కిరణ్ పెంట్లవెల్లి ఆంధ్రబ్యాంక్‌లో క్యాషియర్ పనిచేస్తున్నాడు. అతని స్వస్థలం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్లతో కిరణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.