నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-25T12:52:21+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అధికారులు 4 క్రస్టు గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 73,673 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-09-25T12:52:21+05:30 IST