నాచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వివాదం

ABN , First Publish Date - 2020-12-01T20:26:55+05:30 IST

నాచారం డివిజన్‌లో వివాదం చెలరేగింది. కాంగ్రెస్-టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

నాచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వివాదం

హైదరాబాద్‌: నాచారం డివిజన్‌లో వివాదం చెలరేగింది. టీఆర్ఎస్- కాంగ్రెస్  నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  పోలింగ్ బూత్‌ల దగ్గర టీఆర్‌ఎస్‌ నేతలు కండువాలు వేసుకోని  ఉండడంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.ఓటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రభావితం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.  టీఆర్ఎస్ నేతలు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

Updated Date - 2020-12-01T20:26:55+05:30 IST