మార్కెట్‌లోకి ‘మై నేషన్‌’ శానిటైజర్‌: జైళ్లశాఖ

ABN , First Publish Date - 2020-06-21T12:43:58+05:30 IST

మార్కెట్‌లోకి ‘మై నేషన్‌’ శానిటైజర్‌: జైళ్లశాఖ

మార్కెట్‌లోకి ‘మై నేషన్‌’ శానిటైజర్‌: జైళ్లశాఖ

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కట్టడికి జైళ్లశాఖ నేనుసైతం అంటూ మరో ముందడుగు వేసింది. ‘మై నేషన్‌’ పేరిట తాము తయారుచేస్తున్న హ్యాండ్‌ శానిటైజర్లకు సంబంధించిన 50, 100, 200, 500 మిల్లీలీటర్ల బాటిళ్లను త్వరలోనే మార్కెట్‌లోకి విడుదలచేస్తామని జైళ్లశాఖ డీజీ రాజీవ్‌ త్రివేది వెల్లడించారు. వీటి ఉత్పత్తికి చర్లపల్లి కేంద్ర కారాగారంలో అత్యాధునిక శానిటైజర్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మైనేషన్‌ హ్యాండ్‌ శానిటైజర్ల వాణిజ్యపరమైన ఒప్పందాల కోసం ఔత్సాహికులు నేరుగా జైళ్ల శాఖను సంప్రదించవచ్చన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలోని తయారీ కేంద్రానికి నెలకు 50 వేల లీటర్ల హ్యాండ్‌ శానిటైజర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. 

Updated Date - 2020-06-21T12:43:58+05:30 IST