పనుల్లో నాణ్యత పాటించాలి: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-20T04:01:42+05:30 IST

పనుల్లో నాణ్యత పాటించాలి: ఎమ్మెల్యే

పనుల్లో నాణ్యత పాటించాలి: ఎమ్మెల్యే
మోడల్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ టౌన్‌, డిసెంబరు 19: మోడల్‌ మార్కెట్‌ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని దయానిలయం ప్రాంతంలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న మోడల్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను శనివారం ఆయన తనిఖీ చేశారు. అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పి.జమున, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, కౌన్సిలర్‌ కర్రె శ్రీనివాస్‌, జిట్ట శ్రీశైలం పాల్గొన్నారు.


Read more