గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ABN , First Publish Date - 2020-11-25T08:01:27+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర

ఠాగూర్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్ సూచించారు. గ్రేటర్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గ ఇన్‌చార్జీలతో గాంధీభవన్‌లో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీ రేవంత్‌రెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్ని డివిజన్లలోనూ పార్టీ నేతలు గట్టిగా పనిచేయాల్సిందేనని, మెజారిటీ స్థానాలను గెలుచుకుని మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని ఠాగూర్ ఇన్‌చార్జీలకు సూచించారు.