సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2020-12-20T03:50:38+05:30 IST

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గండ్ర

అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

చిట్యాల, డిసెంబరు 19: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాయలంలో ఎంపీపీ దావు వినోద అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజర య్యారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల గురించి సభలో సభ్యు లు  ప్రస్తావించారు. ఆయా శాఖల అధికారులను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిఽధుల మధ్య సమ న్వయం లోపించొద్దన్నారు. అంకితభావంతో పనిచేసి ప్రజా సమ స్యలను పరిష్కరించాలన్నారు. రైతులు డిమాండు ఉన్న పంటలపై దృష్టి సారించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. ఆయా అభివృద్ధి పనులను ఇంజనీరింగ్‌ విభాగం అధికా రులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 

సర్పంచ్‌ల గోడు

పల్లెప్రగతి పనుల్లో భాగంగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు సర్పంచ్‌లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కోరారు. అధికారుల ఆదేశాలతో గ్రామాల్లో డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్‌ షెడ్డు తదితర పనులు చేపట్టామన్నారు. నెలలు గడుస్తున్నా బిల్లులు రావడంలేదన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని బిల్లుల మంజూరుకు సహకరించాలని సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, సర్పంచులు సాయిసుధ, భాస్కర్‌, మహేందర్‌, పోషాలు, పూర్ణచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. మైనారిటీలు ఉన్న గ్రామాల్లో ఖబరస్తాన్లకు (ముస్లింల శ్మశానవాటికలు) స్థలాలు కేటాయించి ప్రహారీలు నిర్మించాలని కోఆప్షన్‌ సభ్యుడు రాజ్‌మహ్మద్‌ కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన విజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీపీ దావు వినోద, జడ్పీటీసీ గొర్రె సాగర్‌, ఎంపీడీవో రవీంద్రనాథ్‌, కార్యాలయం సిబ్బంది, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శుల ఘనంగా సత్కరించారు.  సమా వేశంలో తహసీల్దార్‌ షరీఫ్‌ మోహియిద్దీన్‌,  ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాంచంద్‌, ఈఈ నిర్మళ, వివిధ శాఖల అధికారులు రఘుపతి, శంకర్‌రావు, రవికుమార్‌, అనీల్‌కుమార్‌,  నాగరాణి, మంజూల, అబ్దుల్‌ అలీం తదితరులు పాల్గొన్నారు.

సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన

మొగుళ్లపల్లి : మండలంలోని ఆకినపల్లి గ్రామంలో రూ. 28 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీరోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు అనంతరం ఇస్సిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రకృతివనాన్ని ప్రారంభించారు.సీసీ రోడ్డు, మట్టి రోడ్డు పనులు, పోచమ్మతల్లి, దుర్గమ్మ తల్లి ఆలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ యార సుజాత, జడ్పీటీసీ జోరుక సదయ్య, సర్పంచులు కోడారి సునీత, మెట్టు వనమాల, ఎంపీటీసీలు రాజేశ్వరి, వైఎస్‌ ఎంపీపీ రాజేశ్వర్‌రావు,  ఎంపీడీవో రామయ్య, పీఆర్‌ఏఈ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు కొడారి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-20T03:50:38+05:30 IST