శాంతిభద్రతలకు సహకరించాలి

ABN , First Publish Date - 2020-11-21T10:18:31+05:30 IST

శాంతిభద్రతలకు సహకరించాలి

శాంతిభద్రతలకు సహకరించాలి

ఏటూరునాగారం రూరల్‌, నవంబరు 20: శాంతి భద్రతల పరిరక్షణకు పౌరులందరూ సహకరించాలని సీఐ కిరణ్‌కుమార్‌ కోరారు. మండలంలోని శంకరరాజుపల్లిలో గ్రామస్థులకు ‘డయల్‌ 100’పై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో  వెంటనే 100 నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసు సహాయం పొందాలన్నారు. ప్రజలెవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.

Read more