ప్రణాళికాయుతంగా మూసీ పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-12-30T08:32:53+05:30 IST

మూసీ నదిలో కాలుష్యాన్ని నివారించి పర్యావరణహితంగా మారేలా చేపడుతున్న పనులను ప్రణాళికాయుతంగా కొనసాగించాలని ఎన్‌జీటీ నియమించిన మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌, జస్టిస్‌ విలాస్‌ వి.అఫ్జల్‌ పుర్కర్‌

ప్రణాళికాయుతంగా మూసీ పనులు చేపట్టాలి

ఎన్‌జీటీ మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ విలాస్‌ వి.అఫ్జల్‌ పుర్కర్‌


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిలో కాలుష్యాన్ని నివారించి పర్యావరణహితంగా మారేలా చేపడుతున్న పనులను ప్రణాళికాయుతంగా కొనసాగించాలని ఎన్‌జీటీ నియమించిన మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌, జస్టిస్‌ విలాస్‌ వి.అఫ్జల్‌ పుర్కర్‌ అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఇతర సభ్యులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మూసీ ప్రక్షాళనకు వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు.

Updated Date - 2020-12-30T08:32:53+05:30 IST