మూసీ ప్రాజెక్ట్ నాలుగు గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2020-08-20T14:10:33+05:30 IST

వరద ఉధతి అధికంగా ఉండటంతో మూసీ ప్రాజెక్ట్ నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేశారు.

మూసీ ప్రాజెక్ట్ నాలుగు గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

సూర్యాపేట: వరద ఉధతి అధికంగా ఉండటంతో మూసీ ప్రాజెక్ట్ నాలుగు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం నాలుగు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా... ప్రస్తుత నీటి మట్టం 642.8 అడుగులకు(3.89టీఎంసీలు) చేరింది. ఇన్ ఫ్లో 5,455 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,455 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-08-20T14:10:33+05:30 IST