మూసి ప్రాజెక్టుకు వరద ఉధృతి
ABN , First Publish Date - 2020-10-15T04:07:49+05:30 IST
మూసి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ..
సూర్యాపేట: మూసి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 644.70 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 1,53,470 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1,61,199 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 4.36 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.