అర్ధరాత్రి కిరాయి హంతకుల హల్‌చల్.. ఎంపీపీ కుటుంబంపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2020-09-16T16:12:32+05:30 IST

నల్లగొండ: చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో అర్ధరాత్రి కిరాయి హంతకులు హల్ చల్ చేశారు.

అర్ధరాత్రి కిరాయి హంతకుల హల్‌చల్.. ఎంపీపీ కుటుంబంపై హత్యాయత్నం

నల్లగొండ: చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో అర్ధరాత్రి కిరాయి హంతకులు హల్ చల్ చేశారు. ఎంపీపీ సునీతా వెంకటేష్ కుటుంబంపై హత్యాయత్నం చేశారు. 15 మంది కిరాయి హంతకులు 4 కార్లలో వచ్చారు. గ్రామస్తులు ప్రతిఘటించడంతో కుట్ర భగ్నమైంది. తొమ్మిది మందిని పట్టుకుని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. పాతకక్షలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-09-16T16:12:32+05:30 IST