పారిశుధ్యం బాధ్యత మున్సిపాలిటీలదే..!
ABN , First Publish Date - 2020-10-01T08:59:03+05:30 IST
పట్టణ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలల పరిధిలో పారిశుధ్యాన్ని నిర్వహించే బాధ్యత స్థానిక మున్సిపాలిటీలే తీసుకోవాలని పురపాలక శాఖ సంచాలకులు....
పట్టణ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలల పరిధిలో పారిశుధ్యాన్ని నిర్వహించే బాధ్యత స్థానిక మున్సిపాలిటీలే తీసుకోవాలని పురపాలక శాఖ సంచాలకులు ఎన్.సత్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఈ బాధ్యతలను స్థానిక గ్రామ పంచాయతీలు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా పురపాలక శాఖ కూడా ఇదే రకమైన ఆదేశాలు జారీ చేసింది.
- హైదరాబాద్