నీళ్లు చల్లాకే రోడ్లు ఊడ్చాలి: మునిసిపల్ శాఖ
ABN , First Publish Date - 2020-12-30T08:30:18+05:30 IST
పట్టణ ప్రాంతాల్లో రహదారులను ఊడ్చడానికి ముందు నీళ్లు చల్లాలని, తద్వారా దుమ్ము లేవకుండా చూడాలని సంబంధిత సిబ్బందిని మునిసిపల్ శాఖ ఆదేశించింది

పట్టణ ప్రాంతాల్లో రహదారులను ఊడ్చడానికి ముందు నీళ్లు చల్లాలని, తద్వారా దుమ్ము లేవకుండా చూడాలని సంబంధిత సిబ్బందిని మునిసిపల్ శాఖ ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) ఇటీవల ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఈ మేరకు సర్క్యులర్‌ను జారీ చేసింది. సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు(ఎ్‌సటీపీ)లలో శుభ్రం చేసిన నీటిని రహదారులపై చల్లేందుకు వినియోగించాలని సూచించింది.